Share News

బీద రవిచంద్రయాదవ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం సముచితమే

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:05 AM

టీడీపీ యాదవులకు సముచిత స్థానం కల్పించిందని శ్రీకృష్ణ యాదవ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్‌ పేర్కొన్నా రు.

బీద రవిచంద్రయాదవ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం సముచితమే

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీకృష్ణ యాదవ సేవాసంఘం కృతజ్ఞతలు

గుడివాడ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీగా బీద రవిచంద్రయాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా టీడీపీ యాదవులకు సముచిత స్థానం కల్పించిందని శ్రీకృష్ణ యాదవ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్‌ పేర్కొన్నా రు. సోమవారం ఏలూరురోడ్డులోని సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొలుసు పార్థసారథికి సంఘం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు జాజుల తాతారావు, మునీంద్ర, రామారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:05 AM