స్టెల్లాలో ఇంటర్న్‌షిప్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:38 AM
స్థానిక మారిస్ స్టెల్లా కళాశాల ఆవరణలో గురు వారం స్టెల్లా కళాశాల, ఐ బిలీవ్ ఐ క్యాన్(ఐబీఐసీ) సంయుక్త ఆధ్వర్యం లో ఇంటర్న్‌షిప్ ఫెలిసిటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

స్టెల్లాలో ఇంటర్న్‌షిప్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్
బెంజిసర్కిల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక మారిస్ స్టెల్లా కళాశాల ఆవరణలో గురు వారం స్టెల్లా కళాశాల, ఐ బిలీవ్ ఐ క్యాన్(ఐబీఐసీ) సంయుక్త ఆధ్వర్యం లో ఇంటర్న్‌షిప్ ఫెలిసిటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో సాధించిన విజయాలను గుర్తించి వారికి ప్రశంసలు అందజేశారు. విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్‌లో రూపొం దించిన వాతావరణ సూచన యాప్, మ్యాజిక్ నెంబరు యాప్, సాంగ్ లిరిక్స్ ఎకా్ట్స్రక్టర్ యూప్ వంటి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈయాప్‌లు పైతాన్, ఎస్‌క్యూ ఎల్, ఫ్లాస్క్ వంటి సాంకేతికతలతో రూపొం దించారు. ఐబీఐసీ బృందం విద్యార్థులు, అధ్యాపకులు మాట్లాడుతూ పరిశ్రమలో అనుభవాన్ని పొందే అవకాశాలు విద్యార్థుల భవిష్యత్‌కు సహకరిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐబీఐసీ బోర్డు డైరెక్టర్ డాక్టర్ బి. కీర్తి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు అనిత బాల, ఐబీఐసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు సెరీనా డిసిల్వా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వాడ్రస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్‌లు అందజేశారు.