Share News

గాయపడిన నవ వధువు మృతి

ABN , Publish Date - May 13 , 2025 | 12:40 AM

వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవవధువు మూడెడ్ల రమ్యరూప(32) సోమవారం మృతి చెందింది.

 గాయపడిన నవ వధువు మృతి

హనుమాన్‌జంక్షన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవవధువు మూడెడ్ల రమ్యరూప(32) సోమవారం మృతి చెందింది. తునికి చెందిన రమ్యరూపకు హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మూడెడ్ల ధీరజ్‌తో గత ఏప్రిల్‌ 30న వివాహం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళుతు ఉండగా వీరవల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో భర్త ధీరజ్‌తో పాటు ఆడపడుచు భర్త నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలికి మొదట చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వీరవల్లి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 12:40 AM