Share News

స్పీడు పెంచండి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:56 AM

విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సంబంధించి భూ సేకరణలో ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ యం త్రాంగం స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉంది.

స్పీడు పెంచండి

విజయవాడ - ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూ సేకరణ జరిగింది 60 శాతమే

మిగిలిన భూములను త్వరగా అప్పగించాలంటూ ఎన్‌హెచ్‌ లేఖ

త్వరగా పెండింగ్‌ గజిట్‌లు పూర్తి చేసి భూములు అప్పగించాలని అభ్యర్థన

మరో 20 శాతం భూములు ఇస్తేనే పనులు చేపట్టడానికి అవకాశం

ఇప్పటికే ఖరారైన ప్యాకేజీ-3 పనులు .. మేఘా సంస్థకు దక్కిన కాంట్రాక్టు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సంబంధించి భూ సేకరణలో ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ యం త్రాంగం స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉంది. త్వరితగతిన మాకు భూములు అప్పగించాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగానికి ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్‌హెచ్‌ అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం అప్పగించాల్సిన 245 ఎకరాల్లో 60 శాతం భూములను మాత్రమే సేకరించి ఇచ్చింది. ఇంకా 40 శాతం భూములను సేకరించి ఇవ్వాలి. కనీసం మరో 20 శాతం మే ర భూములను అయినా సేకరించి ఎన్‌హెచ్‌ అధికారులకు అప్పగించగలిగితే.. 80 శాతం భూములు వచ్చాయన్న క్లాజ్‌లో కాంట్రాక్టు సంస్థ పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా నుంచి విజయవా డ జక్కంపూడి వరకు 30 కిలోమీటర్ల దూరానికి పనులు చేపట్టాల్సి ఉంది. విజయవాడ-నాగ్‌పూర్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి అత్యంత ప్రాముఖ్యత పోషించనుంది. నాలుగు వరసలతో నిర్మించే ఈ హైవే ప్రాజెక్టుకు ఇంతకు ముందే టెండర్లు కూడా పిలిచారు. మేఘా సంస్థ ఈ పనులను దక్కించుకుంది. పనులు చేపట్టాలంటే 80 శాతం భూ సేకరణ జరగాలి. ఇప్పటికే విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భాగంగా ఖమ్మం జిల్లాలో రెండు ప్యాకేజీల పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఎటొచ్చీ ఎన్టీఆర్‌ జిల్లాలోనే ప్యాకేజీ-3 పనులు మిగిలిపోయాయి. తాజాగా ఎన్‌హెచ్‌ అధికారులు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో రైతుల నుంచి భూములను తీసుకోవటానికి వీలుగా తాము రూ.74.49 కోట్లను కేటాయించామని త్వరితగతిన స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా 9.24 హెక్టార్ల భూమిని అప్పగించాలని కోరారు. జక్కంపూడి గ్రామంలో పెం డింగ్‌లో ఉన్న 3ఏ గెజిట్‌ ప్రచురణను వేగంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జి.కొండూరు, విజయవాడ రూరల్‌ మండలాల పరిధిలో 9.04 హెక్టార్ల 3డీ గజిట్‌ ప్రచురణ కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Updated Date - Apr 12 , 2025 | 12:56 AM