శ్రీవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సౌభాగ్యం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:58 PM
తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణమండపంలో శ్రీవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్క రించుకుని సౌభాగ్యం కార్యక్రమం నిర్వహిం చారు.
లబ్బీపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణమండపంలో శ్రీవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్క రించుకుని సౌభాగ్యం కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో టీటీడీ ఆధీనంలో ఉన్న 60 దేవాలయాల్లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి వచ్చిన మహిళలకు సౌభాగ్య ప్రతిరూపాలైన కుంకుమ, పసుపుతాడు, అమ్మవారి పుస్తకం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయాల పర్యవేక్షణ అధికారి మల్లికార్జునరావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలితా రమాదేవి పర్యవేక్షించారు.