నీలాగా సూట్‌కేసు కంపెనీలు పెట్టే అలవాటు నాకు లేదు
ABN , Publish Date - May 23 , 2025 | 01:35 AM
‘నీలాగా సూట్‌కేసు కంపెనీలు పెట్టే అలవాటు నాకు లేదు. దమ్మూ ధై ర్యం ఉంటే లిక్కర్ స్కాం ఎవరి హయాంలో జరిగిందో చెప్పాలి.’ అని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సవాల్ విసి రారు.
దమ్ముంటే లిక్కర్ స్కాం ఎవరి హయాంలో జరిగిందో చెప్పు
మాజీ సీఎం జగన్‌కు ఎంపీ కేశినేని చిన్ని సవాల్
ఇబ్రహీంపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): ‘నీలాగా సూట్‌కేసు కంపెనీలు పెట్టే అలవాటు నాకు లేదు. దమ్మూ ధై ర్యం ఉంటే లిక్కర్ స్కాం ఎవరి హయాంలో జరిగిందో చెప్పాలి.’ అని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సవాల్ విసి రారు. జగన్ రెడ్డీ నువ్వు కేవలం ఎమ్మెల్యేవి.. నేను ఎంపీని.. నాస్థాయి ఎక్కువ అని గ్రహించు..నీలి మీడియాలో రాసే కంపెనీలు ఎక్కడున్నాయో చెప్పు. అని గుంటుపల్లి సీఏ కన్వెన్షన్‌లో గురువారం నిర్వహించిన మినీ మహానాడు వేదికగా చిన్ని నిలదీశారు. వైసీపీ గూం డాలు, ఆకురౌడీలు దౌర్జన్యాలు దాడులు చేయాలని ప్రయత్నిస్తే తెలుగు తమ్ముళ్లు తిప్పి కొట్టాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకే తాను స మాధానం చెబుతాననని, విధూషకులకు చెప్పబోనని స్పష్టం చేశారు.
ఎంపీ కేశినేని చిన్నిపై జగన్ ఆరోపణలు నిరాధారం
మాజీ ఎంపీ కేశినేని నానీ పేటీఎం బ్యాచ్‌లో చేరారు
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి
‘ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)పై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ఎంపీ కేశినేని శ్రీనివా్‌స(నాని) పేటీఎం బ్యాచ్‌లో చేరారు. చిల్లరకు కక్కుర్తి పడి నాని చేసిన ఆరోపణలే జగన్ కూడా చేస్తున్నారు. బెంజిసర్కిల్‌లో కట్టిన హోటల్ ఎవరి పేరుపైన పెట్టావు? బ్యాంకులకు డబ్బులు ఎగొట్టి దగా చేశావు కాబట్టే గుమాస్తాలను డైరెక్టర్లుగా పెట్టుకున్నావు. బ్యాంకులను మోసం చేసిన నీతో మాట్లాడించేది తాడేపల్లి సైకో కాదా?’ అని కేశినేని నానీని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి నిలదీశారు.