Share News

చెట్టు కింద ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ విధులు

ABN , Publish Date - May 20 , 2025 | 01:18 AM

ఇబ్రహీంపట్నం, కొండపల్లిలోని పలు పల్లపు ప్రాంతాలు ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి జలమయమయ్యాయి.

చెట్టు కింద ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ విధులు
చెట్టు కిందే రికార్డులు పరిశీలిస్తున్న తహసీల్దార్‌ వై.వెంకటేశ్వర్లు

ఇబ్రహీంపట్నం/జి.కొండూరు, మే 19(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం, కొండపల్లిలోని పలు పల్లపు ప్రాంతాలు ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి జలమయమయ్యాయి. రోడ్లు ఏర్లను తలపించా యి. డ్రెయినేజీలు పొంగి వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్‌ కార్యాలయంలోకి భారీ గా వర్షపు నీరు చేరింది. సోమవారం విధులు నిర్వర్తించే వీలు లేకపోవడంతో తహసీల్దార్‌ వై.వెంకటేశ్వర్లు చెట్టు కిందే విధులు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట భారీగా వర్షపు నీరు చేరింది. ఉద్యోగులు లోప లికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఎంఈవో కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. ఈకార్యాలయాల న్నీ పల్లపు ప్రాంతంలో ఉండటంతో జలమయయ్యాయి. జి.కొండూరు మండలం కోడూరులో శిథిలావస్థలో ఉన్న మూతపడిన గ్రంథాలయం శ్లాబు వర్షానికి బాగా నాని పడిపోయింది.

Updated Date - May 20 , 2025 | 01:18 AM