Share News

దుర్గమ్మకు భారీ ఆదాయం

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:36 AM

కనకదుర్గమ్మ భారీగా ఆదాయం లభించింది. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. మహామండపం ఆరో అంతస్థులో ఈవో శీనానాయక్‌ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. 44 హుండీల్లోని 167 సంచులను తెరిచి లెక్కించారు.

దుర్గమ్మకు భారీ ఆదాయం
కానుకలు లెక్కిస్తున్న ఆలయ అధికారులు, ఉద్యోగులు, సేవాబృందం

44 హుండీల ద్వారా రూ.4.33 కోట్ల కానుకలు

420 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి కూడా..

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ భారీగా ఆదాయం లభించింది. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. మహామండపం ఆరో అంతస్థులో ఈవో శీనానాయక్‌ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. 44 హుండీల్లోని 167 సంచులను తెరిచి లెక్కించారు. రూ.4కోట్ల33లక్షల85వేల655లతో పాటు 420 గ్రాముల బంగారం, 6 కిలోల 614 గ్రాముల వెండి, పలు దేశాల కరెన్సీ లభించాయి. 582 యూఎస్‌ఏ డాలర్లు, 22 సింగపూర్‌ డాలర్లు, 215 కెనడా డాలర్లు, 485 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (దిర్హామ్స్‌), 15 సౌదీ రియాల్స్‌, 1 ఒమన్‌ బైసా, 18 ఖతార్‌ రియాల్స్‌, 23 మలేషియా రింగిట్స్‌, 15 యూరోప్‌ యూరోలు, 2 1/4 కువైట్‌ దీనార్‌లు, 250 ఆసే్ట్రలియా డాలర్లు, 15 ఇంగ్లండ్‌ పౌండ్లు లభించాయి. ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, దేవదాయ శాఖ అధికారులు, ఏఈవోలు, సిబ్బంది, ఎస్పీఎఫ్‌, వన్‌టౌన్‌ పోలీసులు, అమ్మవారి సేవాదారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:36 AM