పాడి పరిశ్రమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - May 15 , 2025 | 12:38 AM
వ్యవసాయ రంగం తర్వాత పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
చల్లపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగం తర్వాత పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశుపోషకులకు 50శాతం సబ్సిడీపై సమీకృత దాణా పంపిణీని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. భారత్ పశుధన్‌యా్‌పలో నమో దై, తెల్ల రేషన్‌కార్డు ఉన్న పశుపోషకులకు మాత్రమే సబ్సిడీపై ఈ దాణా లభిస్తుందని చల్లపల్లి సబ్‌డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వెంకట భార్గవ తెలిపారు. 50 కిలోల దాణా రూ.1,110 కాగా, సబ్సిడీపై రూ.555కు అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలో జనరల్ కేటగిరీకి 10 వేల కిలోలు, ఎస్సీ కేటగిరీకి 6,300 కిలోలు, మోపిదేవి మండలంలో జనరల్ కేటగిరీకి 9వేల కిలోలు, ఎస్సీ కేటగిరీకి 6450 కిలోలు కేటాయించినట్లు ఆయన వివరించారు. పశువైద్యాధికారి పి.మనోజ్‌కుమార్, ఎంపీపీ కోట విజయ రాధిక, మోర్ల రాంబాబు, మాలెంపాటి శ్రీనివాసరావు, షేక్ నబీఘోరి, సజ్జా చలపతిరావు, డాక్టర్ నందకిషోర్ పాల్గొన్నారు.