Share News

మోదీ పర్యటనకు భారీ బందోబస్తు

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:12 AM

ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు తెలిపారు.

మోదీ పర్యటనకు భారీ బందోబస్తు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబు

గుణదల, ఏప్రిల్‌ 25(ఆంద్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ప్రధాని పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు సీపీ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరం మీదుగా అనేకమంది వీఐపీలు, వీవీఐపీలు ఎంతోమంది గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అమరావతికి రోడ్డు మార్గాన వెళతారని, ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని సీపీ ఆదేశించారు. భద్ర తా చర్యలు నగర వాసులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేలా చూడాలన్నారు. విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఎక్కడైనా ట్రాఫిక్‌ జామ్‌ జరిగితే సత్వరమే నిర్ణయం తీసుకునేలా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వీఐపీలు బసచేసే హోటళ్ల వద్ద కూడా పహారా ఉండేలా చూడాలన్నా రు. డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్వీడీ ప్రసాద్‌, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ప్రసన్నకుమార్‌, ఎం.రాజారావు, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 01:12 AM