గుడివాడలో భారీ వర్షం
ABN , Publish Date - May 17 , 2025 | 01:22 AM
పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పట్టణంలోని శివా రు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
నీటమునిగిన బస్టాండ్.. ధనియాలపేటలో ఇళ్లలోకి చేరిన వర్షపునీరు
గుడివాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పట్టణంలోని శివా రు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వారంరోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో సతమతమవుతూ, ఉక్కపోతలతో అల్లాడుతున్న పట్టణ ప్రజలకు భారీ వర్షం ఊరటనిచ్చింది. భారీ ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్టు నేలకొరిగాయి. ధనియాలపేటలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల డ్రెయినేజీలు పొంగి రహదారికిపైకి మురుగునీరు చేరింది. గుడివాడ బస్టాండ్ దారుణంగా మారింది. బస్టాండ్ నీట మునిగింది. ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు.