వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - May 19 , 2025 | 12:25 AM
అభయాంజనేయస్వామి దేవస్థానంలో 24వ హనుమజ్జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
హనుమాన్‌జంక్షన్, మే 18(ఆంధ్రజ్యోతి): అభయాంజనేయస్వామి దేవస్థానంలో 24వ హనుమజ్జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రో జు ఆదివారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యుడు స్వామికి సుప్రభాత సేవ, అర్చన, గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 1008 లిల్లీపూలతో పూజ చేశారు. ముముక్షు భజన సమాజం మహిళలు కళావేదికపై సంప్రదాయ సంకీర్తనలు ఆలపించారు. ఆలయం ఎదుట విజయదుర్గ కోలాటం బృందం మహిళలు ప్రదర్శించిన కోలాటం భజన స్థానికులను రంజింపచేసింది. ఈవో పి.తారకేశ్వరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.