Share News

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:19 AM

కూటమి ప్రభుత్వం ఇంటంటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన
తిరుమలశెట్టివారి వీధిలో ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటింటి ప్రచారం

సత్యనారాయణపురం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఇంటంటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురం తిరుమల శెట్టివారి వీధిలో మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలను తెలియజేయడానికే ఇంటింటికీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, డివిజన్‌ ఇన్‌చార్జి గార్లపాటి విజయకుమార్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి తుమ్మలపెంట శ్రీనివాస్‌, డివిజన్‌ అధ్యక్షుడు కోటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పొట్లురి కృష్ణప్రసాద్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమురి ఆనందసూర్య తదితరులు పాల్గొన్నారు.

చిట్టినగర్‌: పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్‌ అధ్యక్షుడు బెవర జోగేశ్వరరావు, కార్యదర్శి గొల్లవెల్లి నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం టేనర్‌పేట 114, 115, 116, 117 బూత్‌లో ఇంటింటికీ తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.నాగుల్‌ మీరా మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలు అర్హులందరికీ అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చారి ్జటి.ప్రభుదాస్‌, పేరా బత్తుల రమణ, పిల్ల బంగారయ్య, బోయల కృష్ణ, గూడేల రాంబాబు, ఎస్‌.కె నాగూర్‌, పిల్లా సాయి, సగురు పిల్ల సింహాచలం, దాసరి నాగమణి, బొంత సీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:19 AM