Share News

రైల్వేస్టేషన్లలో జీఎం తనిఖీలు

ABN , Publish Date - May 03 , 2025 | 01:14 AM

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్‌, శివారు ప్రాం తాల రైల్వేస్టేషన్లను విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ నరేంద్ర ఏ పాటిల్‌తో కలిసి తనిఖీలు చేశారు.

రైల్వేస్టేషన్లలో జీఎం తనిఖీలు
రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌

రైల్వేస్టేషన్‌, మే 2(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్‌, శివారు ప్రాం తాల రైల్వేస్టేషన్లను విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ నరేంద్ర ఏ పాటిల్‌తో కలిసి తనిఖీలు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబరు ప్లాట్‌ఫాం నుంచి తనిఖీలను ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా అంశాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, మంచినీటి వనరుల పనితీరు పరిశీలించారు. క్రూ లాబీని తనిఖీ చేసి అక్కడ లో కో పైలట్లు, సిబ్బందితో సంభాషించారు. రోజువారీ కార్యకలాపాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యల ను, అడ్డంకులను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్లాట్‌ఫాం నెంబర్‌ 1లో కూడా ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. తనిఖీ సమయంలో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న సంత్రాగచి-మంగళూరు ఎక్స్‌ప్రె్‌స(నెం22851) ఆన్‌బోర్డు హౌసింగ్‌ కీపింగ్‌ సర్వీసు శుభ్రత, రేక్‌ నిర్వహణను ఆయన పరిశీలించారు. వేసవిలో ప్రయాణికులకు నీరు, మజ్జిగ పంపిణీ చేయటానికి ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన సమ్మర్‌ కియోస్క్‌ పనితీరును పరిశీలించారు. తర్వాత గుణదల రైల్వేస్టేషన్‌లో రూ.24.37 కోట్ల వ్యయం తో నిర్వహిస్తున్న అమృత్‌భారత్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. 12 మీటర్ల ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, ప్లాట్‌ఫాం ఉపరితలం మెరుగుదల, అదనపు కవర్‌ ఓవర్‌ ప్లాట్‌ఫాం, రెండు లిఫ్టుల ఏర్పాటు, వెయిటింగ్‌ హాల్‌, ముందు భాగంలోని భవనం, సర్క్యులేటింగ్‌ ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

Updated Date - May 03 , 2025 | 01:14 AM