Share News

రేపు గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - May 11 , 2025 | 01:12 AM

ప్రతి పౌర్ణమినాడు నిర్వహించే గిరిప్రదక్షణ మా సవారీ ఉత్సవాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శీనా నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు గిరి ప్రదక్షిణ

ఇంద్రకీలాద్రి: ప్రతి పౌర్ణమినాడు నిర్వహించే గిరిప్రదక్షణ మా సవారీ ఉత్సవాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శీనా నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 5.55 గంటలకు ఘాట్‌రోడ్డులోని టోల్‌గేట్‌ వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఘాట్‌రోడ్‌ అమ్మవారిగుడి, కుమ్మరిపాలెం సెంటర్‌, విద్యాధరపురం, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్‌, కొత్తపేట, బ్రాహ్మణవీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుతుందని ఈవో వివరించారు. భక్తులు పా ల్గొనాలని ఆయన సూచించారు.

Updated Date - May 11 , 2025 | 01:12 AM