Share News

సిద్ధార్థ మెడికల్‌ విద్యార్థులకు బహుమతులు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:26 AM

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఏపీ, తెలంగాణ సంయుక్త శాఖ ఐఏఎంఎంటీఏపీసీ(ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ మైక్రోబయాలజిస్ట్స్‌, తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ కంబైన్డ్‌ చాప్టర్‌) వార్షిక సమావేశంలో స్థానిక సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ మైక్రో బయాలజీ పీజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు

 సిద్ధార్థ మెడికల్‌ విద్యార్థులకు బహుమతులు
విజేతలను అభినందిస్తున్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు

ఐఏఎంఎంటీఏపీసీ కాన్ఫరెన్స్‌లో

సిద్ధార్థ మెడికల్‌ విద్యార్థులకు బహుమతులు

ప్రభుత్వాసుపత్రి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఏపీ, తెలంగాణ సంయుక్త శాఖ ఐఏఎంఎంటీఏపీసీ(ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ మైక్రోబయాలజిస్ట్స్‌, తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ కంబైన్డ్‌ చాప్టర్‌) వార్షిక సమావేశంలో స్థానిక సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ మైక్రో బయాలజీ పీజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీల్లో 18 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ మౌఖిక ప్రదర్శనలో డాక్టర్‌ పి.సాయిఅవినాష్‌ రెండో బహుమతి, క్విజ్‌లో డాక్టర్‌ అబ్ధుల్‌ రజాక్‌ మూడో బహుమతి, డాక్టర్‌ అశ్వినీకిరణ్‌, డాక్టర్‌ డి.రాధాదేవి, డాక్టర్‌ ఎం.విశ్వనాథ్‌ టాప్‌-10లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు విజేతలను అభినందించారు.

Updated Date - Oct 14 , 2025 | 12:26 AM