సృజనాత్మకత వైపు దృష్టి సారించండి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:51 AM
యువత మొబైల్ వాడకం సమయం తగ్గించుకుని సృజనాత్మకతను పెంచే అంశాల వైపు దృష్టి సారించాలని జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ (అడ్మినిసే్ట్రటివ్) కేజీవీ సరిత హితవు పలికారు.
సృజనాత్మకత వైపు దృష్టి సారించండి
యువతకు డిప్యూటీ పోలీసు కమిషనర్
కేజీవీ సరిత హితవు
మొగ ల్రాజపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): యువత మొబైల్ వాడకం సమయం తగ్గించుకుని సృజనాత్మకతను పెంచే అంశాల వైపు దృష్టి సారించాలని జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ (అడ్మినిసే్ట్రటివ్) కేజీవీ సరిత హితవు పలికారు. 58వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గురువారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో రచయిత్రి తానీషా రచించిన ‘ఏ టేల్ ఆఫ్ లైస్’ ఆంగ్ల నవల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నవలను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఈ నవల ఇతి వృత్తం అమ్మాయి అపహరణ నేపథ్యంగా సాగుతుందని, పోలీసు శాఖలో మహిళల సంఖ్య తక్కువ అని, నవలలో ముఖ్య పాత్ర మహిళా పోలీసు అధికారిణిది కావడం, విధినిర్వహణలో ఆమెకు ఎదురైన సవాళ్లు, విలువలను స్పృశిస్తూ ఈ నవల సాగడం పట్ల రచయిత్రిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేకా రమేష్, చుండి వెంకటేశ్వర్లు, డీన్ ఆచార్య రాజేష్, ఎడ్యుకన్సల్టెంట్ సుంకర నాగభూషణం, రచయిత పాపినేని సాయి, గ్రంథాలయ అధికారిణి వాణి తదితరులు పాల్గొన్నారు.