Share News

మత్స్యకారుల భృతి విడుదల

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:41 AM

‘మత్స్యకారుల సేవలో..’ పథకంలో భాగంగా సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని శనివారం విడుదల చేశారు. జిల్లాలో 13,077 మంది మత్స్యకారులకు రూ.26కోట్ల15లక్షలు మంజూరు చేశారు.

మత్స్యకారుల భృతి విడుదల
మత్స్యకారుల భృతి చెక్కును అందజేస్తున్న ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్‌ బాలాజీ తదితరులు

13,077 మందికి రూ.26 కోట్లు మంజూరు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : ‘మత్స్యకారుల సేవలో..’ పథకంలో భాగంగా సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని శనివారం విడుదల చేశారు. జిల్లాలో 13,077 మంది మత్స్యకారులకు రూ.26కోట్ల15లక్షలు మంజూరు చేశారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్‌ బాలాజీ ఈ చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేపలవేట నిషేధ సమయంలో గతంలో రూ.10 వేలు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ భృతిని రూ.20 వేలకు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి గురుమూర్తి, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్‌, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:41 AM