పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ప్రథమ బహుమతులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:25 AM
రాష్ట్ర యువజన సర్వీస్‌ల శాఖ నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు
జానపద నృత్య, గీతాల పోటీల్లో
పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ప్రథమ బహుమతులు
మొగల్రాజపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువజన సర్వీస్‌ల శాఖ నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కేబీఎన్ కళాశాలలో జరిగిన పోటీలలో జానపద నృత్యంలో విగ్నేష్ కార్తీక్ బృందం, జానపద గీతాల పోటీల్లో సింధురాగేశ్వరీ బృందం మొదటి బహుమతి గెలుచు కున్నారని వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు విజయవాడ్ సబ్ కలెక్టర్ కావూరి చైతన్య, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు. శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను డైరెక్టర్ వేమూరి బాబూ రావు, డీన్ రాజేష్, కల్చరల్ కమిటీ కో ఆర్డినేటర్ జయప్రకాష్, అభినందించారు.