Share News

ఖాళీ పోస్టులు భర్తీ చేయండి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:26 AM

యూనియన్‌ బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రీజనల్‌ మేనేజర్‌ వెంకట్రావును యూనియన్‌ బ్యాం కు ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజే్‌షఖన్నా కోరారు.

ఖాళీ పోస్టులు భర్తీ చేయండి
భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాజేష్‌ ఖన్నా, ఆర్‌ఎం కె.వెంకట్రావు తదితరులు

యూనియన్‌ బ్యాంకు ఆర్‌ఎంను కోరిన ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజే్‌షఖన్నా

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): యూనియన్‌ బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అధికారులకు పనిభారం తగ్గించాలని రీజనల్‌ మేనేజర్‌ వెంకట్రావును యూనియన్‌ బ్యాం కు ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజే్‌షఖన్నా కోరారు. బుధవారం యూనియన్‌ బ్యాంకు రీజనల్‌ కార్యాలయాన్ని రాజే్‌షఖన్నా సందర్శించారు. రీజనల్‌ మేనేజర్‌ వెంకట్రావుతో అధికారుల సమస్యలపై మాట్లాడారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:26 AM