కొండపల్లి బొమ్మల ఖ్యాతిని చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్
ABN , Publish Date - May 18 , 2025 | 01:30 AM
దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండపల్లి బొమ్మల ఖ్యాతిని నేటి తరానికి చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం
కలెక్టరేట్, మే 17(ఆంధ్రజ్యోతి): దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండపల్లి బొమ్మల ఖ్యాతిని నేటి తరానికి చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఇబ్రహీంప ట్నం మండలం, కొండపల్లిలో శనివారం పర్యాటక, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు. పర్యాటకంగా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలున్నాయ ని కలెక్టర్ అన్నారు. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరించాలని ఆదేశించారు. కొండపల్లి బొమ్మల కాలనీ నుంచి ఖిల్లా వరకు పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహించుకొనేలా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి త్వరితగతిన వినియోగంలోనికి తీసుకువచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ అధికారి ఎస్.పద్మారాణి, టూరి జం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన పాల్గొన్నారు.