Share News

జీఎస్టీతో ప్రతి కుటుంబం లబ్ధి పొందాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:38 AM

జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల తగ్గిన పన్నుల లబ్ధిని రాష్ట్రంలోని ప్రతికుటుంబం పొందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు.

జీఎస్టీతో ప్రతి కుటుంబం లబ్ధి పొందాలి

జీఎస్టీతో ప్రతి కుటుంబం లబ్ధి పొందాలి

ఆటోనగర్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె

ఆటోనగర్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల తగ్గిన పన్నుల లబ్ధిని రాష్ట్రంలోని ప్రతికుటుంబం పొందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. ఈసంస్కరణలపై ప్రజలకు అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తితంగా నెల రోజలు పాటు సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం జవహర్‌ ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డులోని ఆటోనగర్‌ ఎగ్జిబిషన్‌ హాలులో ఏర్పాటైన సూపర్‌ జీఎస్టీ.... సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల తగ్గిన ఎలకా్ట్రనిక్‌ వస్తువుల ప్రదర్శన, అమ్మకాల ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల కేంద్రం నుంచి రాషా్ట్రనికి రావల్సిన వాటాలో రూ. 8వేల కోట్లు తగ్గుతుందని, అయినా ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు దీనిని అమలుచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్‌ జీఎస్టీ విజయవాడ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌. ప్రశాంతకుమార్‌, డీసీలు కె. అపర్ణ, ఎస్‌కే జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:38 AM