డ్రెయినేజీ, తాగునీటి సమస్య రాకుండా చూడండి
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:26 AM
కొండ ప్రాంతవాసులకు వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అదే సమయంలో డ్రెయినేజీ సక్రమంగా పారుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.
డ్రెయినేజీ, తాగునీటి సమస్య రాకుండా చూడండి
నగర కమిషనర్ ధ్యానచంద్ర
గుణదల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కొండ ప్రాంతవాసులకు వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అదే సమయంలో డ్రెయినేజీ సక్రమంగా పారుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం రెండో డివిజన్లో కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారితో కలిసి ఇంటింటికి పర్యటించి క్షేత్ర స్థాయిలో స్థానికులను సమస్యలు అడిగి తెలుసు కున్నారు. డ్రెయినేజీ, తాగునీటి సమస్యలను స్థానికులు వివరిం చారు. సానుకూలంగా స్పందించిన ఆయన కొండ ప్రాంతంలో క్వారీలో నీటి నిల్వలు ఎప్పటికప్పుడు తీసేయాలని ఆదేశించారు. చిన్నబోర్డింగ్ స్కూల్ వద్ద డ్రెయినేజీ నీరు సక్రమంగా పారుదల అయ్యేలా చర్యలు తీసుకో వాలని చెప్పారు. కుమ్మర బజార్లో మురుగునీరు చేరకుండా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న బూస్టర్ పంపులను పరిశీలించి అవసరమైతే మరమ్మతులు చేయించి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె.షమ్మీ, ఇన్‌చార్జ్ మెడికల్ అధికారి డాక్టర్ సురేష్‌బాబు, ఈఈ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు పాల్గొన్నారు.