Share News

ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల నిషేధాన్ని అమలు చేయండి

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:49 AM

రైతు బజార్లలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు, వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియా అధికారులను ఆదేశించారు.

ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల నిషేధాన్ని అమలు చేయండి

ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల నిషేధాన్ని అమలు చేయండి

జేసీ ఇలక్కియా ఆదేశం

కలెక్టరేట్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : రైతు బజార్లలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు, వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియా అధికారులను ఆదేశించారు. నగరంలోని జేసీ చాంబర్‌లో గురువారం మార్కెటింగ్‌, రైతు బజార్ల ఎస్టేట్‌ అధికారులతో జేసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధాన్ని రైతుబజార్లలో ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. వ్యాపారాలు నిర్వహించే రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు. ఉదయం 6 గంటలకే అన్ని రైతు బజార్లలో ఎస్టేట్‌ అధికారులు విధులలో ఉండి ధరల పట్టికను సిద్ధంగా ఉంచాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన ధరలకే రైతు బజార్లలో అమ్మకాలు నిర్వహించేలా ఎస్టేట్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. విధులలో అలసత్వం వహించినా, ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదని జేసీ, ఎస్టేట్‌ అధికారులను హెచ్చరించారు.సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు బి.రాజబాబు, రైతు బజార్ల ఎస్టేట్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 12:49 AM