Share News

విద్యుత చార్జీలు పెంచం

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:08 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక రూపాయి కూడా విద్యుత చార్జీలు పెంచలేదని, రానున్న రోజుల్లో కూడా పెంచబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ఉయ్యూరులో జెమినీ స్కూల్‌ సమీపాన టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద రూ. 4.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లతో కలిసి గురువారం ప్రారంభించారు.

విద్యుత చార్జీలు పెంచం

ఉయ్యూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం వచ్చాక రూపాయి కూడా విద్యుత చార్జీలు పెంచలేదని, రానున్న రోజుల్లో కూడా పెంచబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ఉయ్యూరులో జెమినీ స్కూల్‌ సమీపాన టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద రూ. 4.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యుత ఉత ్పత్తి పెంచకుండా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం తదితర కారణాల వల్ల ప్రజలపై రూ.20వేల కోట్ల భారం పడిందన్నారు. వైసీపీ అడ్డగోలు విధానాల పాపం విద్యుత బిల్లుల్లో సర్‌చార్జీ ఇప్పటికి వెంటాడుతోందని ఆరోపించారు. జిల్లాలో అవసరమైన పది 132 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఉయ్యూరులో నిలిచిపోయిన 132 సబ్‌స్టేషన్‌ త్వరలో నిర్మిస్తామన్నారు. అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. గ్రీన్‌ఎనర్జీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, పీఎం సూర్యఘర్‌ను అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ బాలశౌరి అన్నారు. బందరు పోర్టు పూర్తయిన తరువాత ఆప్రాంతంలో విద్యుత వినియోగం బాగా పెరుగుతుందని అందుకు తగ్గట్టుగా విద్యుతశాఖ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తిచేసి త్వరలో లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ హామీఇచ్చారని బోడె ప్రసాద్‌ అన్నారు. 132 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తిచేస్తే ఉయ్యూరు పరిసర మండలాలకు విద్యుత సమస్య ఉండదని ఇందుకు మంత్రి చొరవ చూపాలన్నారు. ఉయ్యూరు చైర్మన్‌ వల్లభనేని సత్యనారాయణ, ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.సత్యానందం, ఉయ్యూరు ఈఈ కృష్ణనాయక్‌, బీవీ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 01:08 AM