Share News

నూతన కమిటీ సభ్యుల ఎన్నిక

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:18 AM

పటమట హైస్కూల్‌ రోడ్లోని ది విజయవాడ టూ వీలర్స్‌ మెకానిక్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన కార్యాలయంలో ఆదివారం అసోసియేషన సభ్యుల సమావేశం జరిగింది.

నూతన కమిటీ సభ్యుల ఎన్నిక
నూతన కమిటీ సభ్యులు

టూ వీలర్స్‌ మెకానిక్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన

నూతన కమిటీ సభ్యుల ఎన్నిక

భారతీనగర్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పటమట హైస్కూల్‌ రోడ్లోని ది విజయవాడ టూ వీలర్స్‌ మెకానిక్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన కార్యాలయంలో ఆదివారం అసోసియేషన సభ్యుల సమావేశం జరిగింది. ఈసమావేశంలో అసోసియేషన నూతన కమిటీ సభ్యుల ఎన్నిక జరిగింది. నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఎండి ఫీరోజ్‌, అధ్యక్షుడిగా ఎన. ఆంజనేయదాసు, ఉపాధ్యక్షుడిగా బి. వెంకటరమణ, కార్యదర్శిగా ఎండీ జానీ, కోశాధికారిగా ఇర్ఫాన బేగ్‌ ఎన్నికయ్యారు. మిగతా కమిటీ సభ్యులు యధావిధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు ఎండి ఫిరోజ్‌ తెలిపారు. ఈ సమావేశంలో ది విజయవాడ టూ వీలర్స్‌ మెకానిక్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషనకు చెందిన 62 మంది సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:18 AM