Share News

మందుబాబుల ఆగడాలు

ABN , Publish Date - May 12 , 2025 | 12:51 AM

కాలనీ అంతర్గత రోడ్లలో మందుబాబుల ఆగడాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మందుబాబుల ఆగడాలు
భారతీనగర్‌ నాలుగో క్రాస్‌ రోడ్డులో తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలు

ఇబ్బంది పడుతున్న స్థానికులు

(ఆంధ్రజ్యోతి-భారతీనగర్‌): కాలనీ అంతర్గత రోడ్లలో మందుబాబుల ఆగడాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌ వ్యక్తుల అధీనంలో ఉన్న మద్యం షాపుల్లో తాగడానికి గదులు లేకపోవడంతో మద్యం షాపులకు సమీపంలోని కాలనీలు శ్రీనివాసనగర్‌ బ్యాంక్‌ కాలనీ, విజయలక్ష్మి కాలనీ, నాగార్జునగర్‌, భారతీనగర్‌ కాలనీల్లోని ఖాళీ స్థలాలు, శిధిలావస్థలో ఉన్న పార్కులు, అంతర్గత రోడ్లలో మద్యం తాగుతున్నారు. మద్యం తాగాక ఖాళీ మద్యం సీసాలను రోడ్ల మీద పడేస్తున్నారు. కొందరు ఆకతాయులు వాటిని పగలగొడుతున్నారు. సాయంత్ర సమయంలో కొందరు గుంపుగా వచ్చి చీకటిగా ఉన్న స్థలంలో కూర్చుని అక్కడ మద్యం తాగుతూ గంటల కొద్దీ అక్కడే ఉంటున్నారు. బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని కాలనీ మహిళలు చెబుతున్నారు. అధికారులు స్పందించి పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కాలనీ పెద్దలు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2025 | 12:51 AM