Share News

డ్రైవర్‌ మావయ్య బ్లాక్‌మెయిల్‌ బుద్ధి

ABN , Publish Date - May 31 , 2025 | 01:11 AM

మావయ్య అన్న పిలుపును అతడు మరో కోణంలో చూశాడు. బాలికను మాయమాటలతో లొం గదీసుకున్నాడు.

డ్రైవర్‌ మావయ్య బ్లాక్‌మెయిల్‌ బుద్ధి

బాలిక అసభ్యకర ఫొటోలు చూపించి డబ్బులు డిమాండ్‌.. పోలీసులకు ఫిర్యాదు

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

విజయవాడ/బెంజ్‌సర్కిల్‌, మే 30(ఆంధ్రజ్యోతి): మావయ్య అన్న పిలుపును అతడు మరో కోణంలో చూశాడు. బాలికను మాయమాటలతో లొం గదీసుకున్నాడు. బాలికను అసభ్యకరంగా చిత్రీకరించి ఆ ఫొటోలను చూపించి కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. దర్శిపేటకు చెం దిన కుటుంబం గడచిన ఏడాది ఏడాది సెప్టెంబరులో కృష్ణాజిల్లాలోని మంగినపూడి బీచ్‌కు వెళ్లింది. విజయవాడ నుంచి వెళ్లడానికి ఈ కుటుంబం ఒక క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. కైకలూరుకు చెందిన రాజు అనే యువకుడు డ్రైవర్‌గా వచ్చాడు. మంగినపూడి బీచ్‌లో ఈ కుటుంబంతో బాగా కలిసిపోయాడు. ఈ కుటుంబంలో మహిళను అక్క అని పిలవడం మొదలుపెట్టాడు. ఆమె తన కుమార్తెతో రాజును మావయ్య అని పిలిపించింది. అప్పటి నుంచి మావయ్య అని పిలుస్తుండేది. ఇక అప్పటి నుంచి ఈ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగాడు. కొద్దినెలల క్రితం ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను రాజు ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల వద్ద ఉత్తముడిగా మార్కులు వేయించుకున్నాడు. బాలికను తీసుకురావడానికి రూ. లక్ష వరకు ఖర్చులయ్యాయని రెండు దఫాలుగా రూ. 50వేల చొప్పున వసూలు చేశాడు. కన్న కుమార్తె ఇం టికి తిరిగొచ్చిందని ఆనందపడుతున్న సమయంలో తల్లిదండ్రులకు రాజు మరో ఝలక్‌ ఇచ్చాడు. బాలికను అసభ్యకరంగా చిత్రీకరించి కొద్దిరోజులుగా డబ్బు లు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఫొటో లు, వీడియోలు తన స్నేహితుడి వద్ద ఉన్నాయని అతడు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని కథలు అల్లాడు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడు. రోజూ డబ్బుల కోసం ఈ హింస పెరగడంతో బాలిక తల్లిదండ్రులు పటమట పోలీసులను ఆశ్రయించారు. రాజుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Updated Date - May 31 , 2025 | 01:11 AM