నగర సుందరీకరణలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:17 AM
నగర సుందరీకరణకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

వన్‌టౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నగర సుందరీకరణకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రకాశం బ్యారేజ్, వన్‌టౌన్, ఎంజీ రోడ్డు, బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగు రోడ్డు ప్రాంతాలన్నీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణకు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. నిర్మాణ వ్యర్థాలు, కేబుల్ వైర్‌లు, నగర సుందరీకరణకు భంగం కలిగించేలా కనిపించినా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ప్రతిరోజూ ప్లానింగ్ కార్యదర్శులు నగరంలో పర్యటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాటిపై నివేదికను అందజేయాలన్నారు. వ్యర్థాలను వెంటనే తొలగించాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. పగిలిపోయిన ఫుట్‌పాతలు, పాడైపోయిన డివైడర్లు, గుంతలు పడిన రోడ్లను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.