Share News

ఇద్దరి మధ్య వివాదం..ఆటో దహనం

ABN , Publish Date - May 27 , 2025 | 12:49 AM

పట్టణంలోని వీరభద్రపురంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఆటో దహనానికి దారితీసింది.

ఇద్దరి మధ్య వివాదం..ఆటో దహనం

పెడన, మే 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వీరభద్రపురంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఆటో దహనానికి దారితీసింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరభద్రపురంలో నివాసం ఉంటున్న రాజేష్‌, శ్యామలరావుల మధ్య వివాదం ఏర్పడింది. వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టడంపై శ్యామలరావును రాజేష్‌ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన శ్యామలరావు.. రాజే్‌షపై దాడి చేసి గాయపరిచాడు. తనను గాయపరిచాడన్న కోపంతో శ్యామలరావుకు చెందిన ఆటోను ఆదివారం రాత్రి రాజేష్‌ తగులబెట్టాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ నిర్వహించి రాజేషే ఆటోను తగులబెట్టాడన్న నిర్ధారణకు వచ్చారు.

Updated Date - May 27 , 2025 | 12:49 AM