Share News

సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:33 AM

14వ డివిజన్‌లోని సమస్యలపై బుధవారం సీపీఎం జనచైతన్య యాత్రను ప్రారంభిం చింది. కాల్వకట్ట పుట్ట రోడ్డులో సీపీఎం దళం పర్యటించింది.

సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం
జనచైతన్య యాత్రలో సీపీఎం నాయకులు

సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం

పటమట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): 14వ డివిజన్‌లోని సమస్యలపై బుధవారం సీపీఎం జనచైతన్య యాత్రను ప్రారంభిం చింది. కాల్వకట్ట పుట్ట రోడ్డులో సీపీఎం దళం పర్యటించింది. సీపీఎం తూర్పునగర్‌ కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పాదయాత్ర ప్రారం భించినట్లు చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 90 రోజులైనా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన చెందారు. విద్యుత్‌ బిల్లులు గత ప్రభుత్వం కంటే ఎక్కువుగా వస్తున్నాయన్నారు. లంబాడీపేట ప్రాంతాల్లో కోతులను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్‌ కార్యదర్శి రవీంద్ర, నగర నాయకులు గురుమూర్తి, డి.వరప్రసాద్‌, కన్న బాబ్జి, ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:33 AM