Share News

భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం

ABN , Publish Date - May 24 , 2025 | 01:13 AM

పొట్టకూటి కోసం పురాతన భవనం కూల్చే పనులకు వెళ్లి భవ న నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందాడు.

భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం

మచిలీపట్నం టౌన్‌, మే 23(ఆంధ్రజ్యోతి): పొట్టకూటి కోసం పురాతన భవనం కూల్చే పనులకు వెళ్లి భవ న నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన రుస్తుంబాదలో శుక్రవారం జరిగింది. ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపిన వివరాల ప్రకారం..భోగిరెడ్డిపల్లికి చెందిన చిర్ల నరేష్‌(33) ఇలియాస్‌ మోషే మచిలీపట్నం రుస్తుంబాదలోని ఒక పురాతన భవనం కూల్చే పనికి వెళ్లాడు. భవనంలో కొంత భాగం కూల్చారు. శుక్రవారం పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో గోడ నరే ష్‌పై పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. నరే్‌షను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నరే్‌షకు వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతి చెందాడు. నరే ష్‌కు ఇద్దరు పిల్లలు. భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేర కు ఆర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమాని శ్రీనివాసప్రసాద్‌ను పిలిపించి దర్యాప్తు ప్రారంభించారు. భర్తను కోల్పోయిన నాగలక్ష్మి, పిల్లలు భోరున విలపిస్తున్నారు.

Updated Date - May 24 , 2025 | 01:13 AM