వేదాద్రి బ్రహ్మోత్సవాలకు రండి
ABN , Publish Date - May 06 , 2025 | 12:47 AM
బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని సోమవారం ఆలయ ఈవో సురే్‌షబాబు ఆహ్వానపత్రిక అందించి ఆహ్వానించారు.
జగ్గయ్యపేట రూరల్, మే 5(ఆంధ్రజ్యోతి): వేదాద్రిలో ఈనెల ఏడు నుంచి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని సోమవారం విజయవాడలో ఆలయ ఈవో సురే్‌షబాబు ఆహ్వానపత్రిక అందించి ఆహ్వానించారు. 11న భూనీలా సమేత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి తిరుక్కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, కల్యాణానికి రావాలని ఆయన కోరారు. కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ ఆయన వెంట ఉన్నారు.