నిడమానూరు డబుల్ డెక్కర్‌పై నీలినీడలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:50 AM
నిడమానూరు జంక్షన్-మహానాడు జంక్షన్ వరకు ఎన్‌హెచ్-16పై ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన 7 కిలోమీటర్ల నాలుగు వరసల ఫ్లై ఓవర్ ప్రతిపాదన ఉపసంహరణ దిశగా ఆ ఆలోచనలు ఉన్నాయి.
సింగిల్ ఫ్లై ఓవర్‌ను రద్దుచేసే యోచనలో కేంద్రం
వెస్ట్ బైపాస్ పూర్తికావటంతో పునరాలోచనలో మోర్త్
విశాఖ నుంచి వచ్చే ట్రాఫిక్ వెస్ట్ బైపాస్‌కు వెళ్తుందనే ఆలోచన
మెట్రో మార్గానికి ఇబ్బంది లేకుండా ప్రతిపాదనలు
బెజవాడకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అవసరమే..
కీలకమైన ప్రాజెక్టు చేజారకుండా ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా గన్నవరం నుంచి ఎన్‌హెచ్-16 మీదుగా ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎస్ వరకు కారిడార్-1 వెళ్తుంది. ఈ మార్గంలోని నిడమానూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు ఎన్‌హెచ్-16పై మధ్య వరసలో 4 వరసల ఫ్లై ఓవర్‌కు గతంలోనే కేంద్రం అంగీకరించింది. అయితే, ఈ ఫ్లై ఓవర్ కారణంగా నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు మెట్రో లైన్‌కు ఇబ్బంది ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 4.5 కిలోమీటర్ల మేర సింగిల్ ఫ్లై ఓవర్‌ను డబుల్ డెక్కర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. కింది వరసలో సాధారణ ఫ్లై ఓవర్‌పై బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ప్రయాణిస్తాయని, పై ఫ్లై ఓవర్‌పై మాత్రం మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని, ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు రూ.1,000 కోట్లు అంచనా వ్యయం అవుతుందని మినిస్ర్టీ ఆఫ్ రోడ్డు అండ్ ట్రాన్స్‌పోర్ట్స్ (మోర్త్)కు ఏపీఎంఆర్‌సీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై మోర్త్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతా అటు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. సాధారణ ఫ్లై ఓవర్ అవసరం లేదన్న దిశగా మోర్త్ ఆలోచన చేస్తోంది. సాధారణ ఫ్లై ఓవర్ కాదనుకుంటే.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కూ
ప్రజాప్రతినిధులు స్పందించాలి
మెట్రో కారిడార్ కారణంగా నిడమానూరు ఫ్లై ఓవర్ విషయంలో కాలయాపన జరిగింది. ఇదే సందర్భంలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ-3 పనులు తుదిదశకు చేరుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. నిడమానూరు ఫ్లై ఓవర్ ప్రతిపాదన నుంచి తప్పుకొనే ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్‌హెచ్ అధికారులకు సంకేతాలు అందించినట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడకపోతే మాత్రం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.
విజయవాడకే అతిపెద్దది
ఇప్పటి వరకు విజయవాడలో ఉన్న ఫ్లై ఓవర్ల కంటే నిడమానూరు ఫ్లై ఓవర్ అతి పెద్దది. కనకదుర్గ ఫ్లై ఓవర్ కంటే కూడా రెట్టింపు సంఖ్యలో 7 కిలోమీటర్ల మేర ఉంటుంది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్లకు అనుసంధానంగా మహానాడు జంక్షన్ నుంచి సెంట్రల్ మీడియంలో నిడమానూరు జంక్షన్ వరకు 4 వరసల విధానంలో నిర్మించేలా దీని డీపీఆర్ తయారు చేశారు. అవకాశం ఉండదు. కానీ, మెట్రోకు ఇబ్బంది ఉండదు.
జాప్యం జరగకుండా ఉంటే..
నిడమానూరు ఫ్లై ఓవర్ విషయంలో కొంత జాప్యం జరిగింది. ఈ జాప్యం జరగకపోయి ఉంటే ఫ్లై ఓవర్ విషయంలో కేంద్రం పునరాలోచించే అవకాశం ఉండేది కాదు. డీపీఆర్ తయారైన తర్వాత చాలాకాలం వేచి ఉండటం వల్ల టెండర్లు పిలవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కేంద్రం ఇది అవసరం లేని ప్రాజెక్టుగా భావించింది. కానీ, నగరానికి ఇది చాలా అవసరం. మహానాడు జంక్షన్ నుంచి దాదాపు చిన్నాపెద్దా కలిపి 12కు పైగా జంక్షన్లు ఉన్నాయి. ఆటోనగర్‌కు వెళ్లే వాహనాల కారణంగా జంక్షన్ల వద్ద రద్దీ ఏర్పడుతోంది. దీని కారణంగా ఈ మార్గంలో విజయవాడకు చేరుకోవాలంటే అరగంట సమయం పడుతోంది. అంతర్గత ట్రాఫిక్, ఆటోనగర్‌కు వెళ్లే వాహనాల కారణంగా ఈ మార్గంలో ఫ్లై ఓవర్ అవసరం చాలా ఉంది.
మెట్రో వెళ్లాలంటే డబుల్ డెక్కరే కావాలా?
మెట్రో లైన్ కారణంగా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌పై అనవసరంగా కాలాతీతం చేశారేమోనన్న భావన కలుగుతోంది. ఎనికేపాడు నుంచి రామవరప్పాడు వరకు భవనాలు ఉండటం వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. మార్జిన్ల వెంబడి మెట్రో కారిడార్ వేసే పరిస్థితి కూడా లేదు. కానీ, నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఫ్లై ఓవర్‌ను ఆనుకుని మెట్రో లైన్‌ను తీసుకెళ్లడమే పరిష్కారంగా ఉంది. రెండూ పక్కపక ్కన ఉంటాయి. దీనికి అనుగుణంగా ఫ్లై ఓవర్ అలైన్‌మెంట్‌ను అటు, ఇటుగా జరిపితే సరిపోతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.