Share News

సిమెంట్‌ వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

ABN , Publish Date - May 19 , 2025 | 12:29 AM

వీరవల్లికి చెందిన సిమెంట్‌ వ్యాపారిని సైబర్‌నేరగాళ్లు పోలీసుల పేరుతో బురిడీ కొట్టించి రూ.70 వేలు ఫోన్‌పే చేయించుకున్నారు.

 సిమెంట్‌ వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, మే 18(ఆంధ్రజ్యోతి): వీరవల్లికి చెందిన సిమెంట్‌ వ్యాపారిని సైబర్‌నేరగాళ్లు పోలీసుల పేరుతో బురిడీ కొట్టించి రూ.70 వేలు ఫోన్‌పే చేయించుకున్నారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. వీరవల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఆర్నేపల్లి రంగారావు స్థానికంగా సిమెంటు, ఇనుము వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం ఆయనకు కొత్త నెంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ఏఎస్సై ఆనందరావును మాట్లాడుతున్నానని, ఎస్సైకు అత్యవసరంగా రూ.70వేలు కావాలని శనివారం తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో రంగారావు నమ్మాడు. తన దగ్గర నగదు లేకపోవడంతో అల్లుడు డోకల శ్రీహరి ద్వారా నగదు ఫోన్‌పే చేయించారు. ఆదివారం కూడా నగదు పంపకపోవడం, నగదు పంపిన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి ఉండటంతో అనుమానం వచ్చి పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి విచారించారు. ఆనందరావు ఆనే పేరుతో పోలీ్‌సస్టేషన్‌లో ఎవరూ లే రని తేలడంతో మోసపోయామనిగ్రహించిన బాధితుడు రంగారావు ఎస్సై శ్రీనివా స్‌కు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌పే ద్వారా నగదు వెళ్లిన బ్యాంకు ఖాతా హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ఉన్నట్లు గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Updated Date - May 19 , 2025 | 12:29 AM