7 నుంచి వేదాద్రిలో బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - May 04 , 2025 | 01:03 AM
ఈనెల 7 నుంచి వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు.
జగ్గయ్యపేట, మే 3(ఆంధ్రజ్యోతి): ఈనెల 7 నుంచి వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో కె.కిశోర్ మాట్లాడారు. 7న స్వామిని పెండ్లి కు మారుడిని చేయడం, 8న అంకురార్పణ, ధ్వజారోహణ, 9న శేష వాహనసేవ, 10న హనుమంతుసేవ, 11న భూనీలా సమేత యోగా నంద లక్ష్మీ నరసింహస్వామి తిరుక్కల్యాణ మహోత్సవం జరుగుతుందని, 12న తెప్పోత్సవం, గజవాహనసేవ, 13న చూర్ణోత్సవం, వసంతోత్సవం, 14న పవళింపు సేవ తో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందని తెలిపారు. ఈవోతోపా టు వంశపారంపర్య ధర్మకర్తల తరఫున కేసీపీ సిమెంట్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఉదయభాను, నెట్టెంకు ఆహ్వానపత్రికలు
వేదాద్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినే ని ఉదయభానుకు ఈవో కె.సురేష్, కేసీపీ అసిస్టెంట్ మేనేజర్ రాంప్రసాద్ ఆహ్వానపత్రికలు అందించారు.