చేతుల శుభ్రతతో రోగనిరోధక శక్తి పెంపు
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:34 AM
చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగ నిరోఽధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు సూచించారు.
చేతుల శుభ్రతతో రోగనిరోధక శక్తి పెంపు
ప్రభుత్వాసుపత్రి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగ నిరోఽధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు సూచించారు. గ్లోబల్ హ్యాండ్ హైజీన డే సందర్భంగా ఆసుపత్రిలో చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ చేతుల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయని, చేతులను నిత్యం శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు రోగాలు దరిచేరవన్నారు. ప్రతి ఒక్కరూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా మైక్రో బయాలజీ విభాగం అధ్యాపకులు చేతులు శుభ్రం చేసుకునే సరైన పద్ధతులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ర్టేటర్ జి.వి.వి.ఎస్.సత్యనారాయణ, ఏడీ జయలక్ష్మీ, అధ్యాపకులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ అంకిత, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.