Share News

ఆదర్శ గ్రామం బొబ్బర్లంక

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:23 AM

గ్రామాల అభివృద్ధికి ఇంటి పన్ను ల వసూళ్లే ప్రామాణికమని చెబుతున్న ప్రభుత్వ సూచనలను బొబ్బర్లంక గ్రామస్థులు అమలు చేశారు.

ఆదర్శ గ్రామం బొబ్బర్లంక

గడువుకు ముందే నూరు శాతం పన్ను వసూళ్లు

(ఆంధ్రజ్యోతి-మోపిదేవి): గ్రామాల అభివృద్ధికి ఇంటి పన్ను ల వసూళ్లే ప్రామాణికమని చెబుతున్న ప్రభుత్వ సూచనలను బొబ్బర్లంక గ్రామస్థులు అమలు చేశారు. నూరుశాతం ఇంటి ప న్నులు చెల్లించి మండలానికే ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం మార్చి 31వ తేదీ కల్లా నూరుశాతం ఇంటి పన్నులు చెల్లించాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌ దొప్పలపూడి గంగాభవాని, పంచాయతీ కార్యదర్శి కె.రామకోటేశ్వరరావు గ్రామస్థులను కోరారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తామంటూ గ్రామస్థులు ఇంటి పన్నులను సకాలంలో చెల్లించారు. బొబ్బర్లంకలో 254 గృహాలు ఉండగా, ఇతరత్రా చిరు వ్యాపారులు ఉన్నారు. గృహాలకు రూ.1,43,229, చిరువ్యాపారులు రూ.28,645, గ్రంథాల య పన్ను రూ.11,459, లైటింగ్‌ చార్జ్‌ రూ.14,335, స్పోర్ట్స్‌కు రూ.4292, ఫైర్‌ ట్యాక్స్‌ రూ. 1431, నాన్‌ టాక్సెస్‌ రూ.11,400 కలిపి మొత్తం రూ.2,42,366 చెల్లించారు. ఇప్పటికే నూరుశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేసి పంచాయతీ ఖాతాకు జమ చేశారు. మండలంలో 13 గ్రామపంచాయతీలు ఉండగా, నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేసి బొబ్బర్లంక ప్రథమ స్థానంలో నిలిచింది. వెంకటాపురం గ్రామం 33 శాతం వసూలు చేసి, ఆఖరి స్థానంలో ఉంది.

నాలుగేళ్లుగా నూరు శాతం వసూళ్లు

నాలుగేళ్లుగా బొబ్బర్లంక గ్రామం నూరుశాతం పన్ను వసూళ్లు చేస్తోంది. మండలంలో ఆదర్శవంతం గా నిలస్తోంది. జిల్లా పంచాయతీ అధికారి, మండల అధికారుల సూచనలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజల సహకారంతో నూరుశాతం పన్నులు వసూలు చేస్తున్నాం.

- దొప్పలపూడి గంగాభవాని, సర్పంచ్‌

సహకరించిన గ్రామస్థులకు ధన్యవాదాలు

నూరుశాతం పన్నుల చెల్లింపులో ప్రభుత్వానికి సహకరించిన బొబ్బర్లంక గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు సహకరించినట్టే గ్రామా న్ని అభివృద్ధి పథంలో నడిపి మండలంలోనే మరింత ఆదర్శంగా నిలుపుతాం.

- కె.రామకోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి

Updated Date - Mar 13 , 2025 | 01:23 AM