Share News

పీబీ సిద్ధార్థలో బ్లిట్జ్‌క్రీగ్‌- 2025 రేపు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:29 AM

పీబీ సిద్ధార్థ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న బ్లిట్జ్‌ క్రీగ్‌ 2025 రాష్ట్ర స్థాయి అంతర్‌ కళాశాలల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ డైరెక్టర్‌ వేమూరి బాబురావు చెప్పారు.

పీబీ సిద్ధార్థలో బ్లిట్జ్‌క్రీగ్‌- 2025  రేపు
పోస్టర్‌ విడుదల చేస్తున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ బాబూరావు తదితరులు

పీబీ సిద్ధార్థలో బ్లిట్జ్‌క్రీగ్‌- 2025 రేపు

మొగల్రాజపురం, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): పీబీ సిద్ధార్థ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న బ్లిట్జ్‌ క్రీగ్‌ 2025 రాష్ట్ర స్థాయి అంతర్‌ కళాశాలల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ డైరెక్టర్‌ వేమూరి బాబురావు చెప్పారు. సోమవారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో వారు మాట్లాడుతూ బ్లిట్జ్‌ క్రీగ్‌ అంటే జర్మన్‌ భాషలో మెరుపుదాడి అని అర్థం అన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఉప విభాగాధిపతి డాక్టర్‌ టిఎస్‌ రవికిరణ్‌ మాట్లాడుతూ ఈ పోటీలను ఏపీ మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ రవి గుజ్జుల ప్రారంభిస్తారని చెప్పారు. సమన్వయకర్త, కంప్యూటర్‌ సైన్స్‌ ఉపవిభాగాధిపతి కోనేరు సుధీర్‌ మాట్లా డుతూ ఈ పోటీల్లో పత్ర సమర్పణ, పోస్టర్‌ ప్రజంటేషన్‌, కంప్యూటర్‌ క్విజ్‌, కోడింగ్‌ డీ కోడింగ్‌, స్పాట్‌ ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌, నిధి అన్వేషణ పోటీలు ఉంటాయని చెప్పారు. అనంతరం పోస్టర్‌ విడుదల చేశారు.

Updated Date - Mar 11 , 2025 | 12:29 AM