15 నుంచి బీచ్ ఫెస్టివల్
ABN , Publish Date - May 04 , 2025 | 01:00 AM
మంగినపూడి బీచ్‌లో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌ను వి నూత్న రీతిలో నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
వినూత్నంగా నిర్వహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం టౌన్, మే 3(ఆంధ్రజ్యోతి): మంగినపూడి బీచ్‌లో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌ను వి నూత్న రీతిలో నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అధికారులతో బీచ్ ఫెస్టివల్‌పై ఆ యన చర్చించారు. ఫుడ్‌కోర్టులు, పార్కింగ్ ఏర్పాటు, జలక్రీడలు, వినోద క్రీడలు, బీచ్ కబడ్డీ, బోట్ రేస్ తదితర అంశాలపై కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, మెప్మా పీడీ సాయిబాబు, వివిధ శాఖల అధికారులతో ఆయన చర్చించారు. 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌లో లక్షలాది మంది పాల్గొన్నారని తెలిపారు. యువతకు మధురమైన అనుభూతులు మిగిల్చేలా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందు కు వచ్చిన క్రీడాకారులు, కళాకారులకు భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగినపూడిబీచ్‌కు కబడ్డీ ఆడేందుకు జాతీ య క్రీడాకారులు వస్తున్నారని, వీరందరికీ వసతి సదుపాయాలు కల్పించడంపై హోటల్ యజమానులతో మాట్లాడామన్నారు. లక్షలాది పర్యాటకులు వస్తున్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తామన్నా రు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ పాల్గొన్నారు.