Share News

అందరి సహకారంతో ఆటోనగర్‌ అభివృద్ధి

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:27 AM

అందరి పారిశ్రామికుల సహకారంతో విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌, కానూరు న్యూఆటోనగర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ హెడ్‌ఆఫీస్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఐఎల్‌ రామ్‌ తెలిపారు.

అందరి సహకారంతో ఆటోనగర్‌ అభివృద్ధి
ఇండస్ర్టియల్‌ పార్టనర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రామ్‌, దుర్గాప్రసాద్‌, ఖాలిక్‌, రమేష్‌ తదితరులు

అందరి సహకారంతో ఆటోనగర్‌ అభివృద్ధి

ఏపీఐఐసీ హెడ్‌ ఆఫీస్‌ సీజీఎం రామ్‌

ఆటోనగర్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అందరి పారిశ్రామికుల సహకారంతో విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌, కానూరు న్యూఆటోనగర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ హెడ్‌ఆఫీస్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఐఎల్‌ రామ్‌ తెలిపారు. న్యూఆటోనగర్‌లోని ఆటోక్లస్టర్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏపీఐఐసీ ఇండసి్ట్రయల్‌ పార్టనర్‌షిప్‌ డ్రైవ్‌ అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూఆటోనగర్‌ ఐలా కమిషనర్‌ సీతామహాలక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన సీజీఎం రామ్‌ మాట్లాడుతూ ఇండసి్ట్రయల్‌ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. జవహర్‌ ఆటోనగర్‌, న్యూ ఆటోనగర్‌లోని ఐలా సర్వీస్‌ సొసైటీల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని పారిశ్రామికులు కోరగా అందుకు సీజీఎం సానుకూలంగా స్పందించారు.

ఆటోనగర్‌లో సమస్యలు పరిష్కరించాలి

జవహర్‌ ఆటోనగర్‌లోని ఐలాకు పాలకవర్గం లేకపో వడంతో ఎక్కడ సమస్యలు అక్కడే తాండవిస్తున్నాయని ఐలా మాజీ చైర్మన్‌ సుంకర దుర్గాప్రసాద్‌ సీజీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కానూరు న్యూఆటోనగర్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహమ్మద్‌ అబ్ధుల్‌ ఖాలిక్‌ మాట్లాడుతూ న్యూఆటోనగర్‌ ఏర్పడి రెండున్నర దశాబ్థాలు అయినా మౌలికవసతులు లేవని తెలిపారు. జమాక్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ అధ్యక్షుడు త్రిపురనేని చందు మాట్లాడుతూ జవహర్‌ ఆటోనగర్‌లో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసినా తాగునీరు అందడం లేదని, దీనిపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో న్యూఆటోనగర్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి పి. రమేష్‌, కుమర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ర్టియల్‌ పార్టనర్‌షిప్‌ డ్రెవ్‌ పోస్టర్‌ను రామ్‌, దుర్గాప్రసాద్‌, ఖాలిక్‌, రమేష్‌ తదితరులు ఆవిష్కరించారు.

Updated Date - Nov 05 , 2025 | 12:27 AM