Share News

తొలిసారె తెస్తిమమ్మా..

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:47 AM

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆషాఢ సారె మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుంచి మహామండపం ఆరో అంతస్థులోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు.

తొలిసారె తెస్తిమమ్మా..

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం

తొలిసారె సమర్పించిన ఈవో శీనానాయక్‌

దేవస్థానం సిబ్బంది, కుటుంబాలతో కోలాహలం

ఇంద్రకీలాద్రి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆషాఢ సారె మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుంచి మహామండపం ఆరో అంతస్థులోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మొదటి సారెను దేవస్థానం సిబ్బంది తరఫున ఈవో శీనానాయక్‌ దంపతులు, ఆలయ సిబ్బంది కుటుంబాలతో విచ్చేసి సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయం నుంచి సంబరంగా మహామండపం వరకు వచ్చారు. అమ్మవారికి సారె నివేదన చేసి, భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఎల్‌.దుర్గాప్రసాద్‌, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:47 AM