Share News

దర్జాగా.. దర్జీ!

ABN , Publish Date - May 23 , 2025 | 01:25 AM

రెడీమేడ్‌, డిజైన్‌ దుస్తుల కారణంగా టైలర్లకు చేతినిండా పని లేకుండా పోయిన ఈ రోజుల్లో వినూత్నంగా ఆలోచించాడు మండలంలోని వణుకూరుకు చెందిన సీనియర్‌ టైలర్‌ షేక్‌ కాలేషా. పని లేదని నిరుత్సాహపడ కుండా టైలరింగ్‌ సేవలను వినియోగదారుల ఇంటి వద్దకు తీసుకెళ్లి దర్జాగా దర్జీ సేవలందిస్తున్నాడు.

దర్జాగా.. దర్జీ!
వణుకూరులో మొబైల్‌ టైలరింగ్‌ సేవలందిస్తున్న షేక్‌ కాలేషా

ఇంటివద్దకే టైలరింగ్‌ ..వణుకూరులో సీనియర్‌ టైలర్‌ షేక్‌ కాలేషా వినూత్న ఆలోచన

రెడీమేడ్‌, డిజైన్‌ దుస్తుల కారణంగా టైలర్లకు చేతినిండా పని లేకుండా పోయిన ఈ రోజుల్లో వినూత్నంగా ఆలోచించాడు మండలంలోని వణుకూరుకు చెందిన సీనియర్‌ టైలర్‌ షేక్‌ కాలేషా. పని లేదని నిరుత్సాహపడ కుండా టైలరింగ్‌ సేవలను వినియోగదారుల ఇంటి వద్దకు తీసుకెళ్లి దర్జాగా దర్జీ సేవలందిస్తున్నాడు. అందుకోసం తొలుత ఓ రిక్షాను కొన్నాడు. ఎక్కడికయినా తీసుకెళ్లేందుకు అనుగుణంగా దానికి మార్పులు చేసి కుట్టు మిషన్‌ను అనుసంధానించాడు. గ్రామంలోని కాలనీల్లో తిరుగుతూ ఇళ్ల వద్దే పాత, చిరిగిన దుస్తులు కుట్టడం ప్రారంభించాడు. తన సేవలకు మంచి ఆదరణ లభించడంతో టీవీఎస్‌ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి పొరుగూళ్లకు తన సేవలు విస్తరించాడు. రోజుకో గ్రామం తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. అవసరం ఉన్నవాళ్లు కాలేషాకు ఫోన్లు చేసి మరీ దుస్తులు కుట్టించుకుంటున్నారు.

- (ఆంధ్రజ్యోతి-పెనమలూరు)

Updated Date - May 23 , 2025 | 01:25 AM