దుర్గాఘాట్‌లో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - May 11 , 2025 | 01:07 AM
నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శీనా నాయక్ శనివారం ఇంజినీరింగ్ అధికారులు, ఆలయంలోని వివిధ విభాగాల బాధ్యులతో కలిసి దేవస్థానం పరిధిలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు.
అధికారులకు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఆదేశం
ఇంద్రకీలాద్రి, మే 10(ఆంధ్రజ్యోతి): ‘నదిలో నీరు ఎండిపోతున్నందున భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్‌లో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలి. ఘాట్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. మరుగుదొడ్లకు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు అవసరమైన మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలి.’ అని ఇంజనీరింగ్ అధికారులను దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆదేశించారు. నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శనివారం ఇంజినీరింగ్ అధికారులు, ఆలయంలోని వివిధ విభాగాల బాధ్యులతో కలిసి దేవస్థానం పరిధిలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు. పూజా సామగ్రి అమ్మే హాకర్లను క్రమబద్ధీకరించాలని, రేట్లన్నీ ఒకేరీతిలో ఉండేలా చూడాలని లీజుల విభాగం అధికారులకు సూచించారు. కేశఖండనశాలలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని, భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులు, సిబ్బందికి సూ చించారు. కుమ్మరిపాలెంలో దేవస్థానానికి ఉన్న ఖాళీ స్థలం, అక్కడ భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మునిసిపల్ హెడ్‌వాటర్ వర్క్స్ ఎదురుగా కొండ ప్రాం తాన్ని పరిశీలించి రెండో ఘాట్‌రోడ్డు ప్రతిపాదనలపై ఆరా తీశారు. ఆల య భద్రతలో కీలకమైన శివాలయం వద్ద ఉన్న మెట్లు, రుద్రహోమం మండప ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఉత్తరం వైపు మెట్ల దారిలో గతంలో ఉన్న సిబ్బంది నివాస సముదాయాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. కొండపైన అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించే మండపంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్ర్తోక్త విధానంలో కా ర్యక్రమాలను చేయాలని అర్చకులను ఆదేశించారు. కొండపైన మంచినీటి కూలర్లను పరిశీలించారు. శుభ్రం చేస్తున్న తేదీలను ట్యాంక్‌పై రా యాలన్నారు. ఉచిత ప్రసాదం, భక్తులందరికీ పంపిణీ చేసేలా చూడాలని, యాగశాల, పూజా మండపాలను త్వరగా పూర్తిచేసి భక్తులకు అం దుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.