Share News

ఎన్టీఆర్‌ సేవారత్న, కళారత్న పురస్కారాలకు దరఖాస్తులు

ABN , Publish Date - May 03 , 2025 | 01:15 AM

ఎన్టీఆర్‌ సేవారత్న, కళారత్న జాతీయస్థాయి పురస్కారాలు- 2025కు ఎంపిక చేసేందుకు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తుల నుం చి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ (సాహిత్య, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఈఎ్‌సఎస్‌ నారాయణ మాస్టారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్టీఆర్‌ సేవారత్న, కళారత్న పురస్కారాలకు దరఖాస్తులు

గవర్నర్‌పేట, మే 2(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ సేవారత్న, కళారత్న జాతీయస్థాయి పురస్కారాలు- 2025కు ఎంపిక చేసేందుకు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తుల నుం చి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ (సాహిత్య, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఈఎ్‌సఎస్‌ నారాయణ మాస్టారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, వైద్యం, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నాటకరంగం, టీ వీ, సినీ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ఉభయ తెలు గు రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు వారి సేవల గుర్తింపు సర్టిఫికెట్లు, పేపర్‌ కటింగ్‌, ఫొటోలు, జిరాక్స్‌ కాపీలతో పాటు 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలు దరఖాస్తుకు జతచేసి ఈనెల 15వ తేదీ లోపు కార్యాలయానికి చేరేలా చూడాలని కోరారు. మే 25న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేస్తామని పేర్కొన్నారు. వివరాలకు 96523 47207కు ఫోన్‌ చే యాలని సూచించారు.

Updated Date - May 03 , 2025 | 01:15 AM