Share News

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:44 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పుఎమ్మెల్యే గద్దె రామ్మోహన సూచించారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
యూజీడీ వ్యవస్థను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన, తదితరులు

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన

భారతీనగర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పుఎమ్మెల్యే గద్దె రామ్మోహన సూచించారు. సోమవారం 11వ డివిజనలోని కరణంగారి బజార్‌ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన పర్యటించారు. ఆయన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ సమస్యలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాను ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజులు జిల్లాలో విస్తారంగా వర్షాలు, ఈదురుగాలులు సంభవిస్తాయని తెలిపారు. కొండలపై నివాసాలు ఉండేవారు వర్షాలు తగ్గేంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. నగరంలో భూగర్భ డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ డివిజనలోని కరణంగారి బజారులోని భూగర్భ డ్రెయినేజీ సమస్యపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోనేరు రాజేష్‌, నాదెళ్ల రాజేష్‌, జాస్తి సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:44 AM