Share News

11 నుంచి ఆల్‌ ఇండియా ఇన్విటేషనల్‌ టోర్నమెంట్స్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:02 AM

సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా ఈ నెల 11 నుంచి ఆల్‌ ఇండియా ఇన్విటేషనల్‌ టోర్నమెంట్స్‌ నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ అకాడమీ సలహాదారుడు ఎల్‌కే మోహన్‌రావు తెలిపారు.

11 నుంచి ఆల్‌ ఇండియా ఇన్విటేషనల్‌ టోర్నమెంట్స్‌
వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మేకా రమేష్‌, వెంకటేశ్వర్లు, వేమూరి బాబూరావు తదితరులు

మొగల్రాజపురం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా ఈ నెల 11 నుంచి ఆల్‌ ఇండియా ఇన్విటేషనల్‌ టోర్నమెంట్స్‌ నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ అకాడమీ సలహాదారుడు ఎల్‌కే మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం పీబీ సిద్ధార్థ కళాశాల సెమినార్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా టోర్నమెంట్‌కు సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చుండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 14 వరకు( సీ్ట్ర,పురుష) వాలీబాల్‌, 17 నుంచి 20 వరకు పురుషులకు బాస్కెట్‌బాల్‌, ఆహ్వాన క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి, ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, పూర్వ శాప్‌ అధ్యక్షుడు అంకమ్మచౌదరి, క్రీడా విభాగాధిపతి డాక్టర్‌ టి.బాలకృష్ణరెడ్డి, పీడీ మార్కండేయులు, ఉపాధి కల్పనా అధికారి కావూరి శ్రీధర్‌, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:02 AM