Share News

ఆలపాటి సురేశ్‌కుమార్‌కు ‘జంక్షన్‌’తో అనుబంధం

ABN , Publish Date - May 13 , 2025 | 12:42 AM

ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌, రచయిత ఆలపాటి సురేశ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో హనుమాన్‌జంక్షన్‌కు చెందిన పలువురు హర్షం వ్యక్తంచేశారు.

ఆలపాటి సురేశ్‌కుమార్‌కు ‘జంక్షన్‌’తో అనుబంధం

దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు ఆలపాటి లక్ష్మయ్య తమ్ముడి కుమారుడే సురేశ్‌

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమితులవడంతో అభినందనల వెల్లువ

హనుమాన్‌జంక్షన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌, రచయిత ఆలపాటి సురేశ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో హనుమాన్‌జంక్షన్‌కు చెందిన పలువురు హర్షం వ్యక్తంచేశారు. దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు ఆలపాటి లక్ష్మయ్య తమ్ముడు రంగారావు కుమారుడే సురేశ్‌. ఆలపాటి రంగారావు ఉద్యోగం రీత్యా గుంటూరు జిల్లా మేడికొండూరులో స్థిరపడ్డారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సురేశ్‌కుమార్‌ నియ మితులవడంతో స్థానికంగా ఉన్న కుటుంబసభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్‌బాబు ఆలపాటి సురేశ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ జంక్షన్‌ సెంటర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పలువురు సోషల్‌మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.

Updated Date - May 13 , 2025 | 12:42 AM