Share News

మనిషి మేధస్సుతో పోటీపడేదే ఏఐ

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:24 AM

మనిషి మేథస్సుతో పోటీపడేదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అని బెజవాడ బార్‌ అధ్యక్షుడు ఏకే బాషా అన్నారు.

మనిషి మేధస్సుతో పోటీపడేదే ఏఐ
ప్రొఫెసర్‌ హరికిరణ్‌ను సత్కరిస్తున్న బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌, బార్‌ అధ్యక్షుడు బాషా, తదితరులు

మనిషి మేధస్సుతో పోటీపడేదే ఏఐ

బెజవాడ బార్‌ అధ్యక్షుడు

ఏకే బాషావిజయవాడ లీగల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : మనిషి మేథస్సుతో పోటీపడేదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అని బెజవాడ బార్‌ అధ్యక్షుడు ఏకే బాషా అన్నారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌లో మంగళవారం కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హరికిరణ్‌చే ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ లీగల్‌ ప్రాక్టీస్‌’ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ ఏఐ వచ్చిన తర్వాత అన్ని సులభతరం అయ్యాయన్నారు. బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఏఐని ఉపయోగించి మన పనిని ఎంతో మెరుగ్గా చేసుకోవచ్చన్నారు. ప్రొఫెసర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ ఏఐ న్యాయవాద వృత్తిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బార్‌ కార్యవర్గసభ్యులు, న్యాయవాదులు పద్మనాభం, కలతోటి క్రాంతికుమార్‌, బొమ్మసాని రవి, ఆలూరి సుధాకరరావు, వి.రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:24 AM