Share News

వ్యవసాయంలో యాంత్రీకరణను అలవరచుకోండి

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:38 AM

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాఽధించాలని రైతులకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు.

వ్యవసాయంలో యాంత్రీకరణను అలవరచుకోండి
కృష్ణా కలెక్టరేట్‌లో డ్రోన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ

రైతులకు కలెక్టర్‌ బాలాజీ సూచన

మచిలీపట్నం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాఽధించాలని రైతులకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. పురుగుమందుల పిచికారీకి ఉపయోగించే రెండు డ్రోన్లను 80శాతం రాయితీపై మోపిదేవి మండలానికి చెందిన ఇద్దరు రైతులకు కలెక్టరేట్‌లో బుధవారం జేసీ గీతాంజలి శర్మతో కలిసి ఆయన అందించారు. వరి, ఇతర పంటలకు తెగుళ్లు సోకినపుడు తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో పురుగుమందుల పిచికారీకి ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో 32 డ్రోన్లు సబ్సిడీపై ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చామని, రైతులసంఘాల సభ్యులు 15మంది ముందుకు వచ్చి నగదు చెల్లించారని కలెక్టర్‌ తెలిపారు. ఒక్కో డ్రోన్‌ ఖరీదు రూ.9.80 లక్షలని ఇందులో రైతులవాటా 20శాతం, మిగిలి న 80శాతం ప్రభుత్వం సబ్సీడీగా ఇస్తోందని కలెక్టర్‌ తెలిపారు. డ్రోన్ల పనితీరును కలెక్టర్‌, జేసీ పరిశీలించారు. వ్యవసాయశాఖ జేడీ మనోహర రావు, ఏడీ మణిధర్‌, మోపిదేవి మండలం మెరకనపల్లికి చెందిన రైతు ప్రదీప్‌, కోసూరివారిపాలేనికి చెందిన రైతు వెంకటరమణ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 01:38 AM